KTR : రేవంత్.. నేషనల్ హెరాల్డ్ కేసుపై మౌనం ఎందుకు? : కేటీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-18 16:18:01  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

KTR : రేవంత్.. నేషనల్ హెరాల్డ్ కేసుపై మౌనం ఎందుకు? : కేటీఆర్
X

దిశ వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుల(National Herald Case)పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఓ వైపు కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల పేర్లను ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్ షీట్లో(ED Charge Sheet) నమోదు చేయడంపై రోడ్లు మీదికి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తుంటే.. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, స్వయంగా సీఎం అంతటి స్థాయిలో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని పేర్కొన్నారు. ఈ విషయం నాకు మాత్రమే అనుమానంగా కనిపిస్తోందా? అందరికీ అలాగే కనిపిస్తోందా అని సెటైర్ వేశారు.

రాహుల్ కు రేవంత్ కు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయనడానికి ఈ కారణం చాలునని కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా తెలియజేశారు. కాగా ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయగా.. అందులో సోనియా, రాహుల్ పేర్లను నమోదు చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాలు దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేశాయి. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు వద్ద టీ కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాపై రేవంత్ రెడ్డి స్పందించక పోవడం పట్ల కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story