- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్, ఉత్తమ్ ఎవరొచ్చినా సరే.. హరీశ్ రావు సంచలన సవాల్
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్వహిస్తున్న ‘రైతు భరోసా’ విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్వహిస్తున్న ‘రైతు భరోసా’ విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులను కష్టాల పాలు చేసి సంబురాలు చేసుకునే నైతికత రేవంత్ ప్రభుత్వానికి లేదని కామెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderbad)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏం చేసిందని సంబురాలకు చేసుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో 11 సార్లు రైతుబంధు (Raithu Bandhu) కింద రూ.80 వేల కోట్ల ఇచ్చామని.. ఏనాడు తాము ఉత్సవాలు జరపలేదన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం నిజాయితీగా ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చేశామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలను కూడా ఆపినం కానీ.. ఏనాడు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయడం ఆపలేదన్నారు. తాము ప్రవేశ పెట్టిన రైతుబంధు దేశానికి ఆదర్శంగా నిలించిందని.. నేడు కొన్ని రాష్ట్రాల్లో ఇదే పథకం అమలు కావడం కారణం కేసీఆరేనని అన్నారు. ఏపీ ప్రభుత్వం చెపడుతోన్న గోదావరి (Godavari)-బనకచర్ల (Banakacharla)పై ప్రభుత్వ పెద్దలు ఎవరికీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బనకచర్లపై చర్చకు రేవంత్ రెడ్డి వచ్చినా.. లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినా తాను సిద్ధమని హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు.






