- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో(Telangana Secretariet) తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో(Telangana Secretariet) తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం ఈ తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను విడుదల చేసింది. ప్రజా పాలన ఏడాది విజయోత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు(AICC Leaders), ప్రతిపక్ష నాయకులు(Opposition Leaders) సహా పలువురు ప్రముఖులతో పాటు లక్ష మంది మహిళలను కూడా ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా మంత్రుల బృందం(Ministers) పరిశీలించారు. ఈ సాయంత్రం సచివాలయంలో పర్యటిస్తూ.. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. అంతేగాక ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చూడాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukendar Reddy) సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






