కేసీఆర్ అప్పులు తీరుస్తున్న రేవంత్ సర్కార్.. RTI రిపోర్టులో బట్టబయలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-25 14:59:04  IST  )

కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులను రేవంత్ సర్కార్ శరవేగంగా తీర్చేస్తోంది.

కేసీఆర్ అప్పులు తీరుస్తున్న రేవంత్ సర్కార్.. RTI రిపోర్టులో బట్టబయలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన భారీ అప్పులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగినట్లుగా తాజాగా సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న రుణాల అసలు, వడ్డీలను చెల్లించడంలో ప్రస్తుత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రెండేళ్ల రేవంత్ పాలనలో అత్యధికంగా రుణ విముక్తికే అత్యంత ప్రాధన్యతను ఇచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

కేవలం 2025 సంవత్సరంలోనే తెలంగాణ ప్రభుత్వం రూ.33,574 కోట్లను రుణాల కోసమే వెచ్చించింది. ఇది గతేడాది చెల్లింపులతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువే. ఇక 2020 నుంచి చూస్తే ఒక ఏడాదిలో జరిగిన అత్యధిక వార్షిక రుణ చెల్లింపు ఇదే కావడం విశేషం. ఇక అప్పుల భారం ఏ స్థాయిలో ఉందంటే.. 2026 సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క నెలలో రూ.417 కోట్లను ప్రభుత్వం కేవలం వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అప్పులు రాష్ట్ర ఖజానాపై ఎంతటి భారాన్ని మోపాయో తాజాగా ఆర్టీఐ ద్వారా వచ్చిన గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story