- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By Poll) తమ జెండా పాతాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రచార పర్వంలో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓటర్లను తమ వైపు ఆకర్శించే పని పెట్టుకున్నారు. మరోవైపు మంత్రులు, నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ ఉప ఎన్నిక, ప్రచార సరళిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష (Review Meeting) నిర్వహించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రచారానికి గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ప్రచార పర్వం ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంలో సీఎం మంత్రులకు కీలక దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే విషయంలో సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.






