- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొన్ని గంటల్లో పోలింగ్.. కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి కీలక పిలుపు
బీఆర్ఎస్ గేమ్‌లను పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు సార్లు పవర్‌లో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి గెలిచేందుకు

దిశ, డైనమిక్ బ్యూరో/తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ గేమ్‌లను పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు సార్లు పవర్‌లో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి గెలిచేందుకు ఓటర్లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలంతా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. బుధవారం వార్ రూమ్‌లో ఆయన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అన్ని జిల్లాల్లోని అభ్యర్ధులు, అసెంబ్లీ ఇన్ ఛార్జ్‌లతో రేవంత్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రలోభాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఇది కీలకమైన సమయం అని గుర్తు చేశారు. అవసరమైతే నిద్రపోకుండా మానిటరింగ్ చేయాలన్నారు.
ఒక్క రోజు కష్టపడితే, ఐదేళ్ల పవర్ మనదే అని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇదిలా ఉండగా, పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టి సారించింది. ఈసారి గెలుపుపై నమ్మకం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఎన్నికల వార్ రూమ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే రివ్యూ నిర్వహించి అన్ని జిల్లాల నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితులపై ఆరా తీస్తూ, పార్టీ విజయానికి అవసరమైన నిర్ణయాలను సూచించారు.






