Revanth Reddy: ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం.. సీం ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |

ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ట్వీట్ చేశారు.

Revanth Reddy: ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం.. సీం ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) ఏర్పాటును సోమవారం పూర్తి చేసింది. కాంగ్రెస్ ఏడాది పాలన ఉత్సవాల్లో భాగంగా.. చివరి రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విగ్రహిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీనిపై "నాలుగు కోట్ల ప్రజల మనోఫలకాల పై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి.. నేడు సచివాలయ నడిబొడ్డున నిజమై రూపంగా అవతరించిన శుభ సందర్భం అని తెలిపారు. అంతేగాక ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం" అని సీఎం ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story