- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు షెడ్డుకే.. మర్యాద తప్పితే పొలిమేర దాటనివ్వం : సీఎం రేవంత్ రెడ్డి
కోహెడ పండ్లమార్కెట్ తెలంగాణకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకువస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కోహెడ పండ్లమార్కెట్ తెలంగాణకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకువస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న 239 విశాలమైన ఎకరాల్లో కోహెడ అంతర్జాతీయ పండ్లమార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. కాలుష్యం లేని పరిశ్రమలే ఈ ప్రాంతానికి వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూడలేని బీఆర్ఎస్.. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వరంగల్, ఆదిలాబాద్ లలో ఎయిర్ పోర్టు అక్కర్లేదని, ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు కేవలం వరి, మొక్కజొన్నలు, పత్తి, మిర్చి పంటలు మాత్రమే పండిస్తున్నారని, కోహెడ మార్కెట్ అందుబాటులోకి వస్తే పండ్లను కూడా సాగుచేయవచ్చన్నారు. ఒకప్పుడు నగరానికి సరిపడా కూరగాయలు, పాలు రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేవని గుర్తుచేశారు. ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు వచ్చాక రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని, ఆ తర్వాతే జిల్లాలో వ్యవసాయం కుంటుపడిందన్నారు. కొత్తపేట నుంచి కోహెడకు పండ్లమార్కెట్ ను తరలించినపుడు తాత్కాలిక టెంట్లు వేయడంతో.. గాలి, వానకు అవి కూలిపోయి రైతులకు గాయాలయ్యాయని గుర్తుచేశారు. ఆనాడు తాను ఎంపీగా ఉన్నానని, అప్పుడే ఇంటిగ్రేటెడ్ పండ్లమార్కెట్ నిర్మిస్తానని హామీ ఇచ్చానని, నేడు ఆ హామీని సీఎంగా నెరవేస్తున్నానని తెలిపారు.
రూ.లక్ష కోట్ల వ్యయంతో కట్టిన కాళేశ్వరం.. నేడు కూలేశ్వరం అయినా దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం లేకపోతే వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపిస్తున్నామన్నారు. కూలేశ్వరం నేతలతో సలహాలు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కారు ఇప్పుడు పూర్తిగా చెడిపోయి షెడ్డుకు చేరిందని, ఇప్పుడు ఎన్ని రిపేర్లు చేసినా చెడిపోయిన కారు ఇక పనికిరాదని తెలిపారు. నాడు విధ్వంసం సృష్టిస్తే.. తాము వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామన్నారు. ఎవరెంత ఏడ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా ఆర్ఆర్ఆర్, అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కట్టితీరుతామని, 2034 వరకూ తమదే అధికారమని పునరుద్ఘాటించారు.
మోడీని చూపించి భయపెట్టాలనుకుంటే భయపడమని, తమకు మాటలతో పాటు చేతలు కూడా తెలుసని హెచ్చరించారు. ఈనెల 15వ తేదీ తర్వాత ఒడ్లు కొనకుంటే.. బండి సంజయ్, కిషన్ రెడ్డిల సంగతేంటో చూస్తామన్నారు. మర్యాద తప్పితే ఎవ్వరినీ పొలిమేర కూడా దాటనివ్వమని తీవ్ర హెచ్చరిక చేశారు.






