- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడి రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. కేటీఆర్ సంచలన డిమాండ్
లగచర్ల రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బేషరతుగా క్షమపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR)డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బేషరతుగా క్షమపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) డిమాండ్ చేశారు. లగచర్ల అంశం (Lagacharla Issue)పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (National human Rights Commission) నివేదిక (Report) ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ రాష్ట్రంలోని లగచర్లలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తాము చెప్పినట్లుగానే.. లగచర్ల గిరిజన రైతులు, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపారని ఎన్‌హెచ్ఆర్‌సీ రిపోర్టులో ఇచ్చారని తెలిపారు. అంతేగాక అధికారంలో ఉన్నవారు చట్టానికి అతీతులమని భావించే ప్రతి ఒక్కరికీ ఈ నివేదిక ఒక హెచ్చరికలా పనిచేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ అధికార దుర్వినియోగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇక రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజన సోదర సోదరీమణులందరికీ ఇది గొప్ప మొదటి విజయమని, వారందరినీ అభినందించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అంకితభావంతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి లగచర్ల రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు.






