Revanth Reddy: ముఖ్యమంత్రిని కలిసిన ప్రొ. ఘంటా చక్రపాణి

by Ramesh Goud |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. Br Ambedkar Open University) నూతన వీసీగా(Vice Chancellor) ఎన్నికైన ప్రొ. ఘంటా చక్రపాణి(Pro. Ganta Chakrapani) కలిశారు.

Revanth Reddy: ముఖ్యమంత్రిని కలిసిన ప్రొ. ఘంటా చక్రపాణి
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. Br Ambedkar Open University) నూతన వీసీగా(Vice Chancellor) ఎన్నికైన ప్రొ. ఘంటా చక్రపాణి(Pro. Ganta Chakrapani) కలిశారు. జూబ్లీహిల్స్(Jubili Hills) లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఘంటా.. డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఘంటా చక్రపాణిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న ఆచార్య ఘంటా చక్రపాణిని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం ఏయూ వీసీగా బాధ్యతలు స్వీకరించారు.

Next Story