Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-12-11 09:37:49  IST  )

సోనియా, రాహుల్, ప్రియాంకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీని (Priyanka Gandhi) కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇవాళ ఉదయం పార్టీ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు సీఎం వివరించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది. రెండు రోజుల్లో వివిధ రంగాల నుంచి రూ. 5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చాయి.

Next Story