టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తిచూప‌గా తాజాగా టాటా ఛైర్మ‌న్ న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.

టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తిచూప‌గా తాజాగా టాటా ఛైర్మ‌న్ న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. విజ‌న్ 2047 ల‌క్ష్యాలు, పెట్టుబ‌డుల‌కు ఉన్న అనుకూల విధానాల‌ను సీఎం రేవంత్ టాటా ఛైర్మ‌న్ కు వివ‌రించారు. హైద‌రాబాద్ లో స్టేడియంల అభివృద్ధికి స‌హాకారం కోరారు. దీంతో స్టేడియంలు అప్ గ్రేడ్ చేసేందుకు టాటా ఛైర్మ‌న్ సంసిద్ధ‌త చూపించారు.

అదేవిధంగా మూనీ న‌ది పున‌రుజ్జీవం ప్రాజెక్టులోనూ భాగ‌స్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ ఆస‌క్తి చూపింది. రాష్ట్రంలో హోట‌ళ్లు, రిసార్టుల ఏర్పాటుపైనా టాటా ఆస‌క్తి చూపింది. అదే విధంగా కొత్త మానుఫాక్చ‌రింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా ఈ భేటీలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇప్ప‌టికే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం జ‌ర‌గ‌టంతో పాటు ప్ర‌పంచంలోనే అతిపెద్ద బీర్ల త‌యారీ సంస్థ ఏబీ ఇన్‌బెవ్ తోనూ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాల‌తో రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావడంతో పాటు ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌నున్నాయి.

Next Story