రేవంత్ "లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ".! మినరల్ డెవలప్ మెంట్ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Geesa Chandu |

మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.

రేవంత్ లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ.! మినరల్ డెవలప్ మెంట్ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. "బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే అంశాన్ని ప్రజలు గమనించాలన్నారు.ఇక హైడ్రా మీద సీఎం రేవంత్ రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నాడని, రాష్ట్ర భవిష్యత్, భావి తరాల భవిషత్తు కోసం పులి మీద స్వారీ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని, ఆయన రియల్ హీరో అని కొనియాడారు. కానీ కేసీఆర్ ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, ఆయన జీరో అంటూ సంబోధించారు. హైడ్రా ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తున్నట్లే, మూసి రివర్, ట్రిపుల్ ఆర్ ల్యాండ్, ప్రొటెక్షన్, లేక్ ప్రొటెక్షన్ వంటి వాటిపై స్వయంగా సీఎం మానిటరింగ్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం.. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు చేసి వాటాలు పంచుకున్నారన్నారు. గత పది సంవత్సరాలలో హైదరాబాద్ లో జల కళ లేకుండా సర్వనాశనం చేశారన్నారు. దీనంతటికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే" అని అనిల్ మండిపడ్డారు.

Next Story