- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తుండు.. ఎంపీ ఈటల పైర్
తెలంగాణ (Telangana) ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న తమకు ఎక్కడా అప్పు పుట్టడం లేదని, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నదంటూ సోమవారం ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హీట్‌ను పుట్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న తమకు ఎక్కడా అప్పు పుట్టడం లేదని, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నదంటూ సోమవారం ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హీట్‌ను పుట్టిస్తున్నాయి. తనను కోసినా నెలకు తెలంగాణ ఆదాయం రూ.18,500 కోట్లే వస్తుందని, అంతకు మించి రాదని.. ఆదాయానికి మించి తాను ఏమి చేయలేనని రేవంత్ అన్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా ఉన్న వ్యక్తి తెలంగాణ పరువు తీస్తున్నాడని ఆరోపించారు. వేగంగా అభివృద్ధి చెందుతూ GSDPలో రాష్ట్రం దూసుకెళ్తోందని.. దేశంలో ఇప్పటికీ తెలంగాణే ధనిక రాష్ట్రమని అన్నారు. రేవంత్ తాను ముఖ్యమంత్రినని మర్చిపోయి మాట్లాడుతున్నారని.. నెలకు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే రాష్ట్రం దివాళా తీసిందని ఎలా అంటారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే విషయం వారికి అర్థం అయ్యే.. దోచుకుంటున్నారని మండిపడ్డారు. హామీలిస్తున్నప్పుడు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఓ శనిలా దాపురించిందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
Read More: తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు






