- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఘన విజయం.. డీజీపీకి రేవంత్ రెడ్డి కీలక సూచన
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో .. సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రమాణ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో .. సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ సమక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, ఇతర పోలీసులు అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని చెప్పారు. 2ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించారు. కాగా, కాంగ్రెస్ అధికారంలో వస్తే.. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని రేRevanth Reddyవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
- Tags
- revanth reddy
Next Story






