Bhatti Vikramarka : రేవంత్‌రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంచి మనసున్న ముఖ్యమంత్రి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కొనియాడారు.

Bhatti Vikramarka : రేవంత్‌రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంచి మనసున్న ముఖ్యమంత్రి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కొనియాడారు. నేడు ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవంలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ సబ్‌ప్లాన్(SC Sub Plan) కింద తమ ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఈ నిధులను గాలికి వదిలేసిందని, కానీ తాము అలా చేయడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మనసున్న నాయకుడని, ప్రజల కోసం నిజంగా పని చేస్తున్నారని భట్టి పొగడ్తల వర్షం కురిపించారు. తాము మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూడటం లేదని, నిజంగా పనులు చేస్తున్నామని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం 104 స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. వారి చదువు, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకుల, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మొటిక్స్ చార్జీలను 200 శాతం పెంచామని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలదేనని, దొరల పాలన కాదని భట్టి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తోందని, అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నామని వివరించారు.

Next Story