రేవంత్‌రెడ్డికి మెంటల్ డిజార్డర్ వచ్చింది.. ఎమ్మెల్యే వివేకానంద హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్‌రెడ్డికి మెంటల్ డిజార్డర్ వచ్చినట్లు ఉన్నదని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద అన్నారు.

రేవంత్‌రెడ్డికి మెంటల్ డిజార్డర్ వచ్చింది.. ఎమ్మెల్యే వివేకానంద హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి మెంటల్ డిజార్డర్ వచ్చినట్లు ఉన్నదని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి రావాలని అంటున్నారని.. ఆ తర్వాత కేసీఆర్‌నే బూతులు తిడతారని అన్నారు. ఆయన వాడే భాష నీచంగా ఉన్నదని.. అసెంబ్లీలో ఆన్ రికార్డులో బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సభా హక్కులను ప్రభుత్వం ఉల్లఘించిందని.. ఆత్మ స్తుతి పరనిందలా అసెంబ్లీ నడిచిందన్నారు. పాలసీని ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టారని తెలిపారు. హడావిడిగా 13 బిల్లులు ఆమోదించారని తెలిపారు.

బీఏసీలో అసెంబ్లీ 15 రోజులు నడపాలని డిమాండ్ చేశామని చెప్పామని.. కానీ బీఏసీ మినిట్స్‌ను ప్రభుత్వం బయట పెట్టలేదన్నారు. బీఏసీ మీటింగ్‌ను ట్యాంపరింగ్ చేశారన్నారు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ చట్ట విరుద్ధమని గతంలో కాంగ్రెస్ చెప్పిందని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీటీ ఇచ్చిందన్నారు. చర్చ చేయడానికి ప్రభుత్వం భయపడుతున్నదని.. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వమని స్పీకర్ అన్నారని ఆరోపించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లా నడిపారని పేర్కొన్నారు. అసెంబ్లీని నడపడంలో శ్రీధర్‌బాబు విఫలం అయ్యారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించానని రేవంత్‌రెడ్డి చెప్పారని.. కానీ, ఆయన మాటలను ఏపీ ఖండించిందన్నారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామన్నారు.

Next Story