KCR Name: కేసీఆర్ పేరును తొలగించిన రేవంత్ సర్కార్! బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

by Ramesh Naini |   (  Updated:2025-05-02 09:18:54  IST  )

నల్గొండ జిల్లాలో ఓ భవానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) పేరును రేవంత్ సర్కార్ తొలగించింది

KCR Name: కేసీఆర్ పేరును తొలగించిన రేవంత్ సర్కార్! బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లాలో ఓ భవానికి ఉన్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) పేరును రేవంత్ సర్కార్ (Revanth Reddy government) తొలగించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా, (Miryalaguda) మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరులో కేసీఆర్‌ను తొలగించారని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూ. 10 కోట్ల ప్రభుత్వ నిధులతో కేసీఆర్ కళా భారతి నిర్మించారు. కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహం.. కళాభారతి వద్ద బైఠాయించారు.

కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని (BRS) బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.

Next Story