- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా ఇండస్ట్రీకి TG సర్కార్ గుడ్ న్యూ్స్.. స్క్రిప్ట్ ఉంటే చాలు
సినిమా ఇండస్ట్రీకి TG సర్కార్ గుడ్ న్యూ్స్.. స్క్రిప్ట్ ఉంటే చాలు

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో ఫ్యూచర్ సిటీ వేదికగా పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.






