- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రేవంత్.. కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆసక్తికర ట్వీట్..!
దాదాపుగా రెండు నెలల పాటు మైకుల చప్పుళ్లు, నేతల స్పీచులతో దద్దరిల్లిన తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఇవాళ ఒక్కసారిగా మూగబోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ

దిశ, వెబ్‌డెస్క్: దాదాపుగా రెండు నెలల పాటు మైకుల చప్పుళ్లు, నేతల స్పీచులతో దద్దరిల్లిన తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఇవాళ ఒక్కసారిగా మూగబోయాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియడంతో రాష్ట్రంలో అంతా సైలెన్స్ నెలకొంది. క్యాంపెయినింగ్‌కు గడువు ముగియడంతో పొలిషియన్స్ ప్రచార పర్వాన్ని ముగించుకున్నారు. గెలుపు లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల నేతలు ప్రచారం హోరెత్తించారు. హామీలతో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు.. విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో జోరుగా ప్రచారం నిర్వహించి.. అభ్యర్థుల్లో జోష్ నింపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార పర్వం ముగింపు చివర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రేవంత్ రెడ్డి ప్రజలకు భావోద్వేగా మెసేజ్ ఇచ్చారు. ‘‘మీ రేవంతన్న సందేశం’’ పేరుతో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు. ‘‘పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం..ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం..‘చేయి’ చేయి కలుపుదాం.. అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం’’ అని ఓ వీడియో రిలీజ్ చేశారు. చెయ్యి గుర్తుకు ఓటేద్దాం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అరవై సంవత్సరాల పోరాటం.. వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడింది తెలంగాణ రాష్ట్రమని.. తెలంగాణలో కేసీఆర్‌ను పదేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని ఆగం చేసి కూడా మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నాడని మండిపడ్డారు. 30వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణలో మార్పు తీసుకువచ్చి.. మనం కలలు కన్న తెలంగాణ సాకారమయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం ప్రచార గడువు మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా.. తెలంగాణ ప్రజలకు వీడియో ద్వారా కీలక సందేశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి సోనియా బాటలోనే ప్రచార పర్వం చివర్లో ప్రజలకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.






