Revanth Reddy: డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |

రాజ్యాంగ రచయిత డా. బీఆర్ అంబేద్కర్(Dr.Br Ambedkar) వర్ధంతి(Death Annivarsary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు(Tribute) అర్పించారు.

Revanth Reddy: డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగ రచయిత డా. బీఆర్ అంబేద్కర్(Dr.Br Ambedkar) వర్ధంతి(Death Annivarsary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు(Tribute) అర్పించారు. జూబ్లీహిల్స్(Jubili Hills) లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి భారతరత్న డా. అంబేద్కర్ అని, ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narendar Reddy), డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి(Rohin Reddy) పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

Next Story