కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 చెరువుల నీళ్లు తాగినా.. మూడోసారి అధికారంలోకి రావడం కలే: Revanth Reddy

by Disha Web Desk 19 |
కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 చెరువుల నీళ్లు తాగినా.. మూడోసారి అధికారంలోకి రావడం కలే: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేప్టటారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధా వద్ద ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన చేశారు. కాగా, బీఆర్ఎస్ చేసిన ఈ నిరసనలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు.. మూడు గంటలని దుష్ప్రచారం చేసినా.. మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడోసారి అధికారంలోకి రావడం కల. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సే. బై బై కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక, ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపడంతో అమెరికాలో ఉన్న ఆయన.. తన టూర్‌ను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన తిరిగి రాష్ట్రానికి బయలుదేరారు.

Next Story

Most Viewed