Rowdy sheets: ఏపీలో అల్లర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్.. 20 మందిపై రౌడీషీట్లు..

by Indraja |
Rowdy sheets: ఏపీలో అల్లర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్.. 20 మందిపై రౌడీషీట్లు..
X

దిశ వెబ్ డెస్క్: ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 168 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్నవారిపై చార్జ్‌షీట్‌లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.

అలానే ఒకరిని నగరం నుండి బహిష్కరించారు. 20 మందిపై రౌడీషీట్లు, 55 మందిపై సస్పక్ట్ షీట్లు నమోధు చేశారు. అలానే14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నలుగురికి సీఆర్‌పీసీ నోటీసుల ఇచ్చారు. అలానే అనుమానితులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. జూన్ 4న విడుదల కానునున్న ఎన్నికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైయ్యారు.

ఇప్పటికే 183 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు,130 ఫోన్లు, భారిగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల వేళ అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వేళ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. అలానే ఏపీ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించారు.

మరోవైపు 245 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి పిటీషన్ ధాఖలు చేశారు. కాగా ఈ విషయంలో ఈసీ, సీఈవో సహా ఐదుగురు ప్రతివాదులుగా ఉన్నారు. కాగా నేడు అంబటి పిటీషన్‌పై వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. మరోవైపు మాచర్ల ఘటనలో పోలింగ్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. పాల్వాయి గేట్ పోలింగ్ గేట్ కేంద్రంలో విధులు నిర్వహించిన పీవోపై సస్పెన్షన్ వేటు పడింది.

పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సమయంలో ఘటనా స్థంలంలో ఉన్న పీవో, సిబ్బంది పిన్నెల్లిని అడ్డుకోకపోవడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని పీవో, సిబ్బందిని అధికారులు ఆదేశించినట్టు సమాచారం.

Next Story