పిన్నెల్లి దారి ఎటువైపు.. అగమ్యగోచరంగా మారిన ఆయన రాజకీయ భవిష్యత్తు!

by Mamatha |
పిన్నెల్లి దారి ఎటువైపు.. అగమ్యగోచరంగా మారిన ఆయన రాజకీయ భవిష్యత్తు!
X

దిశ,వెబ్‌డెస్క్:పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి, విధ్వంసం స‌ృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా పట్టుబడిన సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా ఆధారాలు లభించడంతో శిక్ష పడటం ఖాయం అంటున్నారు. పాల్వాయిగేటు గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మొదటి నిందితుడిగా పేర్కొన్నారు.

మూడు చట్టాల కింద 10 తీవ్ర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ వివరాలను రెంటచింతల పోలీసులు మెమో రూపంలో స్థానిక కోర్టుకు సమర్పించారు. పిన్నెల్లి పై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఆయనకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. రెండేళ్ల జైలు శిక్ష పడేలా పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి ఆరేళ్లపాటు అనర్హులవుతారని చట్ట నిబంధనలు చెబుతున్నాయి.

Next Story

Most Viewed