ఎన్టీఆర్‌ వల్లనే టాలీవుడ్‌లో నామ రూపం లేకుండా పోయిన ఆ హీరోయిన్.. కారణం అదేనా?

by Kavitha |
ఎన్టీఆర్‌ వల్లనే టాలీవుడ్‌లో నామ రూపం లేకుండా పోయిన ఆ హీరోయిన్.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: నరసింహుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రస్తుతం సినిమాలకు అయితే పూర్తిగా దూరంగా ఉంటుంది. కాగా సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమలో ఉండటం చేతనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు అప్పట్లో ఓ రూమర్ వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సమీరా రెడ్డి ఈ రూమర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. ఆయన దగ్గర నేను సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి మాకు అఫైర్ అంటగట్టారు. ఇక ఈ విషయంలో నేను మా నాన్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అంతే కాదు మా బంధువులు కూడా ఈ రూమర్ నిజమేనా అన్నట్లుగా మాట్లాడారు. ఆ టైంలో మా ఫ్యామిలీ నేను ఎంతగానో ఇబ్బంది పడ్డాం. కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. అని చెప్పుకొచ్చింది.

అయితే గతంలో సమీరా రెడ్డి ఎన్టీఆర్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు హరికృష్ణ సమీరా రెడ్డికి వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పి పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైందని ఓ టాక్ అయితే వినిపించింది.


Next Story

Most Viewed