హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం.. రోగులు షాక్! ఎందుకో తెలుసా?

by Ramesh N |
హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం.. రోగులు షాక్! ఎందుకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు హాస్పిటల్‌ ఎమర్జెన్సీ వార్డులోకి ఏకంగా పోలీస్ వాహనంతో వచ్చారు. అంతేకాకుండా రోగుల బెడ్‌లు అడ్డం వస్తే వాటిని పక్కకు జరుపుతూ నిందితుడు దగ్గరకు వెహికల్ తీసుకువచ్చి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఈ ఘటన జరిగింది.

ఆస్పత్రిలో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్ జూనియర్ రెసిడెంట్ వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అధికారిపై చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం అధికారిని అరెస్ట్ చేసేందుకు డెహరాడూన్ పోలీసులు ఏకంగా తమ వాహనాన్ని ఓపీడీ వార్డులోకి తీసుకొచ్చి మరి అరెస్ట్ చేశారు.

ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులపై మండిపడ్డారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనం వార్డులోకి తీసుకరావడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఆసుపత్రిలో పడకలపై ఉన్న రోగుల ప్రాణాలను, వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. కాగా, వైద్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed