తెలుగు సినీ నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల బిగ్ షాక్

by Rajesh |
తెలుగు సినీ నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్లు షాక్ ఇచ్చారు. పర్సంటేజ్ చెల్లించకపోతే థియేటర్ల మూసివేత తప్పదని ఎగ్జిబిటర్లు తేల్చిచెబుతున్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. జూలై 1 వరకు తెలుగు సినిమా నిర్మాతలకు గడువు విధించారు. ఇందులో కల్కి, పుష్ప-2, గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 చిత్రాలకు మినహాయింపు ఇచ్చారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించేది లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు.

కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. ఇతర సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించేది లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు అంటున్నారు. కాగా, గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేశారు. ఇక, తాజా వివాదం ఎటూ దారితీస్తుందనేది సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed