నాకు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒద్దు... రాజీనామా చేస్తా: Revanth Reddy

by S Gopi |   (  Updated:2023-01-05 03:22:25  IST  )

పార్టీ శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు...Revanth Reddy Comments

నాకు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒద్దు... రాజీనామా చేస్తా: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నాని, తాను రాజీనామా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే తాను అందుకు సిద్ధమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉండడం సహజమని, అయితే, అవి కామనే.. మళ్లీ అవే సర్దుకుపోతుంటాయి.. అంత మాత్రానా జరిగేదేముండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని.. వాటిని నేతలు సర్ధుకుపోవాలని సూచించారంటా. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని లేదని, నేతల సూచనలు తప్పకుండా తాను తప్పకుండా పాటిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.

Also Read....

స్వచ్చ సర్వేక్షణ్‌లో మనమే టాప్! ట్విట్టర్‌లో కేటీఆర్ ప్రశంస..

Next Story