ఆ 12 మంది ఎమ్మెల్యేలను పాతరేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పినపాక కాంగ్రెస్ కార్యాలయం స్థల వివాదంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు హద్దు మీరి వ్యవహరించారని అన్నారు.

Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పినపాక కాంగ్రెస్ కార్యాలయం స్థల వివాదంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు హద్దు మీరి వ్యవహరించారని అన్నారు. అధికారం ఉందని అతిగా వ్యవహరిస్తే.. తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా పాతరేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Next Story