- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP MP Laxman : కుర్చీ కోసం రేవంత్ ఢిల్లీ చుట్టూ : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన లక్ష్మణ్.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదని, సర్కార్ పూర్తిగా విఫలం అయిందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలి.. తన సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం నిత్యం ఢిల్లీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్ ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అధిష్టానం ఆజ్ఞలే తప్ప.. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నాయకులకు పట్టవని అన్నారు. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని.. రేవంత్ రెడ్డి మా స్కూల్లో డ్రాప్ ఔట్ అయ్యి దారి తప్పాడని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.






