- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : మాట తప్పడం రేవంత్ కు అలవాటే : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఫైర్ అయ్యారు. ఎనికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి మాట తప్పడం అలవాటే అని విమర్శించారు. LRSపై కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓమాట.. ఇప్పుడో మాట చెబుతుందని మండిపడ్డారు. LRS పేరుతో ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ LRS తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ నానా యాగి చేసిందని, మరి ఇపుడు ఏం చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. LRS కింద పేదలకు పూర్తి ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇపుడు మాత్రం 25 శాతం మాత్రమే రాయితీ ఇస్తామని మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తన ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే ఎల్ఆర్ఎస్ పథకం అమలులో 25 శాతం రాయితీ ఇవ్వాలని బుధవారం రాష్ట్ర మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు ఇస్తూ వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.






