Harish Rao : తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు : హరీష్ రావు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(BRS MLA Harish Rao) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మరోసారి విరుచుకు పడ్డారు.

Harish Rao : తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(BRS MLA Harish Rao) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మరోసారి విరుచుకు పడ్డారు. జనగాం(Janagaon)లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. రేవంత్ రెడ్డికి పరిపాలనా దక్షత లేదని మండిపడ్డారు. రేవంత్ తెలంగాణకు గ్రహణంలా పట్టరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందుచూపు లేదని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండినప్పటికీ ఆ నీటిని ఒడిసిపట్టే పని చేయలేదని విమర్శించారు. దేవాదుల పంప్ హౌసు(Devadula Pump House)లను 33 రోజులపాటు బంద్ చేయడం వలన ఆ నీరంతా కిందకి వెళ్లిపోయిందని.. దాని ఫలితమే వరంగల్(Warangal) లో లక్ష ఎకరాల పంట ఎండిపోతోందని అన్నారు.

తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలన 20:20 కమిషన్ పాలన అని, ఏ పని పూర్తి కావాలన్నా 20 శాతం కమిషన్ ఆయనకు ముట్టాల్సిందేనని ఆరోపించారు. పరిపాలన చేతగాక సీఎం, మిగతా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని.. లేదా ప్రకృతి మీద నిందలు వేస్తున్నారని తెలిపారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణలో కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టారని, పదేళ్ళలో ఎప్పుడూ కరువు రాలేదని పేర్కొన్నారు. రేవంత్ సర్కారుకు చేతగాక నీరంతా సముద్రం పాలు చేశారని మండిపడ్డారు.

Next Story