- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్‌కు కేసీఆర్ జపం తప్ప పాలన తెల్వదు.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇవాళ ఆమె మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమానిక శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సభలో కవిత మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు. అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. తెలంగాణ జాగృతి తరఫున ఢిల్లీలోని సోనియాగాంధీకి పోస్టు కార్డు ద్వారా పంపుతున్నామని కవిత అన్నారు.
ఆడబిడ్డలకు స్కూటీలు ఏమాయె..
రాష్ట్రంలోనే ఉండి పాలనను గాడిలో పెట్టాల్సింది పోయి ఢిల్లీ టూర్లలో సీఎం రేవంత్ రెడ్డి మునిగి తేలుతున్నారని ఎమ్మెల్యే కవిత ఫైర్ అయ్యారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ ఊదరగొట్టారని.. రాష్ట్రం ఒక్క స్కూటీ ఇచ్చిన పాపాన పోలేదని కామెంట్ చేశారు. కానీ, ఏ ఒక్క ఆడబిడ్డ అడగకపోయినా రాష్ర్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన పేదింటి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఒక్క కేసీఆరే అని అన్నారు. ఎలాగైన అధికారంలోకి రావాలనే కుట్రతో కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హమీ ఇచ్చారని.. బంగారం లేదు ఆ పథకం కూడా కనుమరుగయ్యేలా చేశారని మండిపడ్డారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరుల చేస్తామని అన్నారని.. తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని కవిత ఆక్షేపించారు.
హమీలు అమలు చేసేంత వరకు పోరాటం ఆగదు..
18 నెలలుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి గోస పడుతున్నారని.. అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామనే స్థితి వచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఏదైనా కొట్లాడితే వస్తుందని.. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, విద్యార్థులతో మమేకమై కేసీఆర్ పోరాటం చేశారని, తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశారని 10 శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి, కొడంగల్ లిఫ్ ఇరిగేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని.. కానీ కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్లు ముట్టజెప్పారని కవిత ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని.. అందులో కాంగ్రెస్ నేతలను సభ్యులుగా నియమించారని కవిత ఆరోపించారు. నిజమైన పేదోళ్లు సొంత ఇంటి కలకు దూరం అవుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి కేసీఆర్, న్యూట్రీషియన్ కిట్ల ఇచ్చి వారిని అమ్మ ఒడి వాహనాల్లో ఇళ్ల వద్ద దిగబెట్టే వారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లో అమ్మ ఒడి వాహనాల్లో డీజిల్ పోసే పరిస్థితి లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే నిరుగ్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సీఎం సమాధానం చేప్పాలన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ.. తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఫోజులు కొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో రూ.2 లక్షల కోట్ల అప్పుల చేసిందని.. ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని, ఒక్క కాలువ, రోడ్డు వేయలేదని.. అంతా దోచుకుతినడమే ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.






