- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదు.. సీపీఐ నేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
కృష్ణా (Krishna), గోదావరి (Godavari) జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏళ్లుగా పంచాయితీ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా (Krishna), గోదావరి (Godavari) జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏళ్లుగా పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే, ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి - బనచర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు పూనుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వివాదంపై కేంద్ర జలశక్తి కలుగుజేసుకుని ఇరు రాష్ట్రల సీఎంలతో సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా, గోదావరి జల జగడంపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని కామెంట్ చేశారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతి అంశంపై ప్రధాన ప్రతిపక్షం సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని.. తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేయలేదని అన్నారు. ఇరు రాష్ట్రాల్లో గత పాలకులు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బనకచర్ల అంశాలన్ని తెరపైకి తెచ్చారని నారాయణ మండిపడ్డారు.






