Revanth: ఢిల్లీ పర్యటనలో సీఎం.. కీలక అంశాలు కొలిక్కి వచ్చే అవకాశం

by Ramesh Goud |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో(Delhi tour) ఉన్నారు.

Revanth: ఢిల్లీ పర్యటనలో సీఎం.. కీలక అంశాలు కొలిక్కి వచ్చే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో(Delhi tour) ఉన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ఏఐసీసీ ఆఫీస్(AICC Office) ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఇవాళ, రేపు రాజధానిలో ఉండనున్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో(Union Ministers) భేటీ కానున్నారు. ఈ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాధనలు కేంద్రమంత్రుల ముందు ఉంచనున్నారు.

అలాగే సీఎం ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురంచి చర్చించే అవకాశం ఉంది. అంతేగాక త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల అంశం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

Next Story