- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్, ఉత్తమ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలనలో ఫెయిలయ్యారని, పాలమూరు రైతులను మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డివి మతిలేని మాటలు అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పాలమూరుకు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన హరీశ్ రావు.. బీఆర్ఎస్ పాదయాత్ర భయంతో రేవంత్ (Revanth Reddy) నిద్రలేచారని సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కై ద్రోహం చేస్తున్నారని, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 75 శాతం నీటిని వాడుకుంటే తెలంగాణ 25 శాతం నీటిని మాత్రమే వాడుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిలయ్యారని వీరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హాయంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. పాలమూరు రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కొడంగల్ లో మళ్లీ రేవంత్ రెడ్డిని ఓడిస్తామన్నారు. పాలమూరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.






