TG: ఇరిగేషన్‌లో 13 మంది ఉద్యోగుల రిటైర్‌మెంట్

by Gantepaka Srikanth |

రాష్ట్ర నీటి పారుదల శాఖ(Irrigation Department)లో ఒకేరోజు 13 మంది అధికారులు ఉద్యోగ విరమణ పొందారు.

TG: ఇరిగేషన్‌లో 13 మంది ఉద్యోగుల రిటైర్‌మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటి పారుదల శాఖ(Irrigation Department)లో ఒకేరోజు 13 మంది అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు సోమవారం రిటైర్డ్ అయ్యారు. కాగా.. వీరిలో ఇటీవలే ఈఎన్సీ (అడ్మిన్‌)గా ప్రమోషన్ పొందిన కరీంనగర్ ఈఎన్సీశంకర్ సైతం ఉన్నారు. శంకర్ గత గురువారం ఈఎన్సీగా ప్రమోషన్ పొందారు. కాగా.. ఖాళీలు ఏర్పడ్డ ఆయా పోస్టుల్లో ఇప్పటికే పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 13 మంది స్థానాల్లోనూ 13 మంది అధికారులు అడిషనల్ బాధ్యతలు ఇచ్చారు.

Next Story