తెలంగాణ ఉద్యమ మేధావి.. ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి కన్నుమూత

by Bhanu |

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి మంగళవారం ఉదయం నారాయణగూడ లో ఆయన నివాసంలో

తెలంగాణ ఉద్యమ మేధావి.. ఉస్మానియా రిటైర్డ్  ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి కన్నుమూత
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి మంగళవారం ఉదయం నారాయణగూడ లో ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ , బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్, ఐ సి ఎస్ ఎస్ ఆర్ సీ డైరెక్టర్ గా పలు కీలక పదవుల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సలహాదారుడిగా ఉంటూ.. తెలంగాణ భావజాలంతో తెలంగాణ ఉద్యమానికి విశేష కృషి చేశారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో కవి అందెశ్రీతో పాటు రాష్ట్ర కళాకారులకు మర్రిగూడ మండల కేంద్రంలో ఆయన ధూంధాం కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను జాగృతం చేశారు. స్వస్థలం నల్లగొండ జిల్లా శివన్న గూడెం గ్రామానికి చెందిన ఆయన వృత్తిరీత్యా నగరానికి వచ్చి నారాయణగూడ లో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక కూతురు ఎస్బిఐ మేనేజర్ కాగా ఆమె భర్త పాట్నా జడ్జిగా పనిచేస్తున్నారు. ఆయన 'మరపురాని జ్ఞాపకాలు' అనే తన జీవిత చరిత్రను వ్రాసుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కడసారి చూసేందుకు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నారు. శివన్నగూడ నుండి నారాయణగూడా కు పలువురు, గ్రామస్తులు, స్నేహితులు వస్తున్నారు.

Next Story