- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య
జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే భార్య హత్యకు గురయ్యారు. ఘటన నేపథ్యంలో సిటీ సిపీ సజ్జనార్ రంగంలోకి దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో దారుణం చోటు జరిగింది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వర్టార్స్ లో ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే (Vinay Ranjan Ray) భార్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం విగతజీవిగా పడి ఉన్న రంజన్‍రే భార్యను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రంజన్‍రే భార్యను పనిమనిషి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చోరీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన స్థలాన్ని సీటీ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీ, హర్యానాల్లో ఉగ్రదాడుల కుట్ర భగ్నం.. ఆలయాలు, ధాబాలే లక్ష్యంగా ISI ప్లాన్
Next Story






