- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో సీన్ ఛేంజ్.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆసక్తికర ట్వీట్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయకుంటే కుటుంబమంతా ఉరి

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయకుంటే కుటుంబమంతా ఉరి వేసుకొని చనిపోతామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. నన్ను సాదుకుంటారా? చంపుకుంటారా మీ ఇష్టం అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాపం బీఆర్ఎస్ అభ్యర్థులు ఆగం ఆగం అవుతున్నారని, చివరికి ఇలాంటి బ్లాక్ మెయిల్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు మరిచిపోయిన విద్య, వైద్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కౌలు రైతులు, గజ్వేల్ ఓటర్లు, తెలంగాణ భావోద్వేగం గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఏమో నిరుద్యోగులు, జాబ్ క్యాలెండరు, కొత్త రేషన్ కార్డులు, ధనవంతులకు రైతు బంధు ఇవ్వొద్దు లాంటివి గుర్తొస్తున్నాయన్నారు. కవితమ్మ అడ్రస్ గల్లంతు పాపం ఎక్కడ కుర్చోపెట్టిన్రో.. ఆమెను చూస్తే ప్రజలకు ఢిల్లీ లిక్కర్ స్కాం గుర్తొస్తుంది.. అని తెలిపారు. రాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోయిందని, ఓటర్ల సునామి బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు.






