యాదాద్రి ఆలయానికి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భారీ విరాళం

by Gantepaka Srikanth |

యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ఆలయానికి(Yadadri Temple) ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.

యాదాద్రి ఆలయానికి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి ఆలయానికి(Yadadri Temple) ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా విలువజేసే తన ఇంటిని దేవుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. వివరాల్లోకి వెళితే.. ముత్తినేని వెంకటేశ్వర్లు(Muthineni Venkateswarlu) అనే వ్యక్తి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. హైద‌రాబాద్‌లోని తిల‌క్ న‌గ‌ర్‌లో ఆయనకు రూ.4 కోట్లకు పైగా విలువజేసే సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటిని గురువారం చిక్క‌డ‌ప‌ల్లిలో స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులో యాద‌గిరిగుట్ట టెంపుల్ ఈవో వెంక‌ట‌రావు స‌మ‌క్షంలో దేవుడి పేరు మీద‌కు రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేష‌న్ అనంత‌రం సంబంధిత డాక్యుమెంట్ల‌ను ఆలయ ఈవోకు అందజేశారు. స్వామివారికి భారీ విరాళం అందజేసిన వెంకటేశ్వర్లును ఆలయ అధికారులు సన్మానించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు. ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి మీద భ‌క్తితో భారీ విలువ‌ గల ప్రాప‌ర్టీని ట్రాన్స్ ఫ‌ర్ చేసినందుకు కృత‌జ్ఞత‌లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సదరు భక్తుడిని మంత్రి కొండా సురేఖ అభినందించారు.

Next Story