- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి బెల్ట్ ట్రీట్‍మెంట్ వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శాంప్రసాద్ రెడ్డి కంటతడి
నిష్టగా పని చేసిన తన పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం నేత శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) స్పందించారు. మాపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. ఆనాడు మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడాన్ని తాము వ్యతిరేకించామని, కేసీఆర్ కు వ్యతిరేకంగా చాలా సార్లు మాట్లాడితే పేపర్లలో హెడ్ లైన్స్ లో వచ్చినా కేసీఆర్ మమ్మల్ని పిలిపించుకుని మాట్లాడారే తప్ప విమర్శించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కన్నెపల్లి వద్ద నీటిని పంపింగ్ చేయడానికి సరిపడా నీరు ఉందని ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా నీటిని పంపింగ్ చేయవచ్చన్నారు. కరువు హెచ్చరికల నేపథ్యంలో వెంటనే అలర్ట్ కాకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ మిషన్ చేయాల్సి ఉంటుందన్నారు.
కంటతడి:
మాకు ఏ పార్టీతో సంబంధం లేదని నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‍లో మాట్లాడామని మీరు ఎప్పుడు పిలిచినా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కలిసి పని చేయడానికి సైట్లో ఉండి పర్యవేక్షించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సిద్ధంగా ఉన్నామని మంత్రితో చెప్పామన్నారు. ప్రభుత్వ సర్వీసులో ఎంతో నిష్టతో పని చేశానని ఇప్పుడు ఇలాంటి అపనింద వేయడం తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.






