ప్రచారం ముగింపు వేళ వాటిపై ఆంక్షలు.. సీఈవో వికాస్ రాజ్ సీరియస్ వార్నింగ్

by Sathputhe Rajesh |

ఎన్నికల ప్రచారం ముగింపు వేళ సీఈవో వికాస్‌రాజ్ అన్ని రాజకీయ పార్టీలకు కీలక సూచన చేశారు.

ప్రచారం ముగింపు వేళ వాటిపై ఆంక్షలు.. సీఈవో వికాస్ రాజ్ సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారం ముగింపు వేళ సీఈవో వికాస్‌రాజ్ అన్ని రాజకీయ పార్టీలకు కీలక సూచన చేశారు. ఓటర్ల మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూడాలన్నారు. సినిమా హాళ్ల ద్వారా ఎన్నికలకు సంబంధించి అంశాలను ప్రదర్శించొద్దన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయరాదని తెలిపారు. అభిప్రాయ సేకరణ, చర్చా కార్యక్రమాలు, విశ్లేషణ, దృశ్య, ధ్వని బైట్‌ల విషయంలో నిబంధనలు పాటించాలన్నారు.

ఈ నెల 29, 30 తేదీల్లో లీడర్లు ఎన్నికలకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని సూచించారు. ప్రెస్ మీట్‌లు, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపొద్దని స్పష్టం చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే విజ్ఞతతో నిర్భయంగా ఓటు వేయాల్సిన అవసరాన్ని ఓటర్లకు మీడియా వివరించాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Next Story