డీహెచ్ కార్యాలయంలో ఆంక్షలు

by Kema Shiva Kumar |

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీపీహెచ్‌) పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి రావడంపై ఆంక్షలు విధించారు.

డీహెచ్ కార్యాలయంలో ఆంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీపీహెచ్‌) పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి రావడంపై ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యే రావాలని, పైగా సంబంధిత అధికారిని కలిసేందుకు ముందస్తుగా అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని డీహెచ్‌ రవీందర్‌ నాయక్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఏవైనా సమస్యలు, దరఖాస్తులు ఉంటే ఖచ్చితంగా సంబంధిత అధికారుల నుంచే ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ ఉత్తర్వులపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శాఖలోని ఉద్యోగులు నేరుగా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ ఇలాంటి ఆంక్షలు లేవని గుర్తు చేస్తున్నారు. 3, 4 గంటల మధ్య ఎవరైనా వచ్చి స్వేచ్ఛగా తమ వినతులను తెలియజేసేలా సడలింపునివ్వాలని కోరారు.

Next Story