ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ఓటమిపై ఈటల రాజేందర్

by Malleboina Mahesh |   (  Updated:2023-12-03 12:23:41  IST  )

హుజురాబాద్, గజ్వేల్ లో ఓటమిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నా 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ఓటమిపై ఈటల రాజేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్, గజ్వేల్ లో ఓటమిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నా 20 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనిది. గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ !! భారత్ మాతా కీ జై !! అని ట్విట్టర్ ద్వారా ఈటల స్పందించారు.

Next Story