- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాదికోసారి వచ్చే అవకాశం.. ఈసారేం ప్లాన్ చేశారు?
ఊరుకుల పరుగుల జీవితాల్లో కాస్త ప్రశాంతతను అందరూ కోరుకుంటాం. నగరవాసుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఊరుకుల పరుగుల జీవితాల్లో కాస్త ప్రశాంతతను అందరూ కోరుకుంటాం. నగరవాసుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవకాశం దొరకడమే ఆలస్యం ట్రిప్పులు, ట్రావెలింగ్ అంటూ ఒక్కసారిగా యాత్రికుల అవతారం ఎత్తుతారు. ఇదీ సరిపోదంటూ ఇంకేదో కావాలని తహతహలాడుతారు. అలాంటి అవకాశాన్ని ఏడాదికోసారి సంక్రాంతి పండుగ తీసుకొస్తుంది. కొత్త అనూభూతి, ఆహ్లదం, గోబ్బిళ్లు, హరిదాసుల కీర్తనలతో ఈ పండుగ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న సంక్రాంతి పండుగకు ఎలాగైనా సరే సొంతుళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఒక్కసారిగా సంక్రాంతికి హైదరాబాద్ వాసులు సొంతుళ్ల బాటపట్టడంతో నగరం ఖాళీ అవుతుంది. ఎక్కడ చూసిన సొంతూళ్లకు వెళ్లే వారే దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేటి నుంచి 17 వరకు పండగ సెలవులను ప్రకటించాయి. ఇక ఈరోజు రెండో శని వారం కావడంతో నిన్నటి నుంచే రద్దీ మొదలైంది. సోమవారం భోగి కావడంతో.. శని, ఆది రెండ్రోజులు రద్దీ అధికంగా ఉండనుంది. మరోవైపు స్కూల్స్, కాలేజీలకు 20 వరకు సెలవులు ఉండటంతో చాలా వరకు పిల్లలను తీసుకుని సొంతుళ్లకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఒక్కసారిగా బస్సులు, సొంత వాహనాలు, ప్రయివేట్ ట్రావెల్స్ ప్రయాణికులతో రోడ్ల మీదకు రావడంతో కూకట్ పల్లి, లక్డీకపూల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రష్ నేపథ్యంలో ఇప్పటికే స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. అబ్దులాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సిబ్బంది 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్బస్ స్టేషన్లు కిక్కిరిసాయి. ఎక్కడా చూసిన జనాలు దర్శనమిచ్చారు. తెలంగాణలో ఎక్స్ప్రెస్లబస్సులు మహిళలకు ఫ్రీ కావడంతో వీటిలో ప్రయాణించడానికి మొగ్గు చూపారు. దీంతో వీటిల్లో అత్యధిక ప్రయాణికులు ప్రయాణించారు.






