- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే తొలి ‘ఫిష్ వ్యాక్సిన్’ కోసం పరిశోధనలు.. ఆక్వా రంగంలో సరికొత్త విప్లవానికి సిఫా శ్రీకారం
దేశంలోనే తొలిసారిగా చేపల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఐసీఏఆర్-సిఫా డైరెక్టర్ ప్రమోద్ కుమార్ సాహు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే తొలిసారిగా చేపల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఐసీఏఆర్-సిఫా (ICAR-CIFA) డైరెక్టర్ ప్రమోద్ కుమార్ సాహు వెల్లడించారు. తెలంగాణ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఒడిషా రాష్ట్ర మీడియా పర్యటనలో భాగంగా ప్రతినిధుల బృందం భువనేశ్వర్‌లోని ‘సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్’ (CIFA)ను సందర్శించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సాహు మరియు సీనియర్ శాస్త్రవేత్తలు సంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. చేపల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు RFID ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థలో 7 రకాల ఆహారపు చేపలు, 7 రకాల అలంకరణ (Ornamental) చేపలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్..
కేంద్ర మత్స్య శాఖ సిఫాను ‘ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ స్పీషీస్ (Species) న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్’గా గుర్తించింది. ముఖ్యంగా రోహు, కాట్లా, కొర్రమీను (Murrel), జీఐ స్కాంపి రకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉన్న కొర్రమీను చేపపై జరుగుతున్న పరిశోధనలను డైరెక్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండి, ముళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఆసియా ఖండంలోని పలు దేశాల ప్రతినిధులకు ఇక్కడ శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక విద్యార్థులు, అధికారులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా.. గతేడాది సుమారు 3,000 మందికి అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పరిశోధనలకు ఆర్థిక చేయూతనిస్తోంది.






