MLA Anirudh Reddy : ప్రమాదకర పరిస్థితులలో టన్నెల్ లో సహాయక చర్యలు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-26 05:32:47  IST  )

ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు(Rescue Teams) ప్రమాదకర పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) వెల్లడించారు.

MLA Anirudh Reddy : ప్రమాదకర పరిస్థితులలో టన్నెల్ లో సహాయక చర్యలు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు(Rescue Teams) ప్రమాదకర పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) వెల్లడించారు. టన్నెలలో సహాయక చర్యల పురోగతిని ఆయన పరిశీలించి స్థానిక మీడియాతో మాట్లాడారు. మంత్రులు జూపల్లి(Jupally), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)లు నిద్ర కూడా పోకుండా టన్నెల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

టన్నెల్ లోకి కొంచెం దూరం వెళితేనే మనకు భయం అవుతుందని..అలాంటిది లోపల చిక్కుకున్న 8 మంది కోసం రెస్క్యూ టీం వాళ్లు 13 కిలోమీటర్ల లోపలికి వెళ్లారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని..ప్రమాదం జరిగిన చోట లోపల మట్టి, బురద ఉండటం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు.

మానవ ప్రయత్నాలకు తోడు దైవ కటాక్షం అవసరమన్న భావనతో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించామని టన్నెల్లో చిక్కుకున్న 8 మంది క్షేమంగా తిరిగి రావాలని మహాశివుడిని ప్రార్ధించామని తెలిపారు. లక్షలాది మంది రైతులు, ఫ్లోరైడ్ బాధితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నామని వివరించారు.

Next Story