‘రెరా’ చైర్మెన్ సత్యనారాయణ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం

by Kema Shiva Kumar |

తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ మండలిలో కీలక పరిణామం చోటుచేసుకున్నది.

‘రెరా’ చైర్మెన్ సత్యనారాయణ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ మండలి (RERA) అధ్యక్ష పదవికి రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇవాళ ఆమోదించింది. ఆరోగ్య కారణాల రీత్యా టీజీ రెరా చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగడానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సత్యనారాయణ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన ప్రభుత్వం, రాజీనామాను ఆమోదిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ మంగళవారం మెమో జారీ చేశారు.

Next Story