- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామూళ్ల మాయలో మళ్లీ నిందల వలయం.. పోలీస్ శాఖలో కలవరం
రాష్ట్ర పోలీస్ శాఖకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇప్పటికే పలు అవార్డులు సైతం పోలీసు డిపార్ట్ మెంట్ దక్కించుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీస్ శాఖకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇప్పటికే పలు అవార్డులు సైతం పోలీసు డిపార్ట్ మెంట్ దక్కించుకున్నది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ లోనూ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల పాస్ పోర్ట్ ధ్రువీకరణ అంశంలో కూడా అవార్డు అందుకుంది. అయితే కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి పోలీసుశాఖను కలవరపరుస్తున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి వరకు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రూరల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మామూళ్ల వ్యవహరం శృతి మించిందనే చర్చ జరుగుతున్నది. అందుకే అక్కడ పోస్టింగుల కోసం భారీగా పైరవీలు కూడా జరుగుతున్నాయని తెలుస్తున్నది. కొన్ని
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో..
కరీంనగర్‌కు చెందిన రేషన్ బియ్యం (పీడీఎస్ రైస్) అక్రమ రవాణ చేసే మధ్యవర్తులకు విభేదాలు రావడంతో పోలీసుల అక్రమ మామూళ్ల విషయం బయటపడింది. ఎస్‌ఐలు రూ.30, సీఐలు రూ.50 వేలు, ఏసీపీలు రూ. లక్ష తీసుకుంటూ తమకు క్లియరెన్స్ ఇస్తారని వారు బహిరంగంగా చెప్పడంతో పీడీఎస్ రైస్ మాఫియాకు పోలీసులు ఎలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారో అర్థమవుతున్నది. నెలకు లక్షలాది టన్నుల పీడీఎస్ రైస్ పొరుగు రాష్ట్రానికి అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ రవాణాలో పోలీసులతోపాటు జీఎస్‌టీ, ఆర్‌టీఏ, డీఎస్‌ఓ, డీటీలు సైతం నెలసరి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీలో 330 కింటాళ్ల బియ్యాన్ని వరంగల్, కరీంనగర్ కేంద్రంగా మహారాష్ట్రలోని గచ్చిరౌలిలోని గోండియాకు తలిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు చేరుతున్న లక్షలాది టన్నుల బియ్యం.. అక్కడి రైస్‌మిల్లుల్లో రీ సైక్లింగ్ అయి.. తరువాత తిరిగి తెలంగాణకే వస్తున్నట్లు సమాచారం. మహదేవ్ పూర పోలీస్ స్టేషన్ లో జరిగిన పంచాయితీలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఒక్క కరీంనగర్ మాత్రమే కాకుండా.. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన కొందరూ ఇదే పద్ధతిలో ఆక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక అక్రమ రవాణాలోనూ..
ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఇసుక ర్యాంపులు నిర్వహించే ప్రాంతాలు, రవాణా మార్గాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు నెలవారీ మామూళ్లు ఠంచన్ గా వెళ్లాల్సిందేనన్న చర్చ ఉన్నది. ఎస్ఐ కి రూ.50 వేలు, సీఐకి రూ.లక్ష, డీఎస్పీకి రూ.2 లక్షలు ప్రతి ఇసుక రీచ్ నుంచి వెళ్తాయని ర్యాంప్ నిర్వహకులు అంతర్గతంగా చెబుతున్నారు. దీంతో అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇసుక లారీలు నిలిపిన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నా.. పోలీసులు పట్టనట్లు వ్యహరిస్తున్నారని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ మ్యాటర్లలోనూ జోక్యం
పోలీసులపై దాఖలవుతున్న 30 పిటిషన్లలో 25 సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించినవే ఉంటున్నాయని హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లను చూస్తే స్పష్టమవుతున్నది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ పోలీసు అధికారులు తమ విధానాన్ని మార్చుకోవడం లేదని ఇప్పటికే హై కోర్టు అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మామునూర్ ఎస్ హెచ్ఓపై చర్యలు తీసుకోవాలని బాధితులు గత ఫిబ్రవరిలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓ భూమికి సంబంధించిన విషయంలో కబ్జాదారులకు వంతపాడుతూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ బండ్లగూడలోని ఓ ఇంటి వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఓ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు. రూ.55 లక్షలు చెల్లించి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులున్నా.. స్టేషన్ కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకూ ఉంచారని బాధితుడు కోర్టుకు వివరించాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని పోలీసులు తనను బెదిరిస్తున్నారని పిటిషనర్ హై కోర్టును ఆశ్రయించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మణుగూరు ఎస్ హెచ్ఓ భూ పంచాయితీలో దూరి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. పోలీసుల అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.






